మాకు సినిమాల్లో అవకాశాలు లేవని ఎవరు చెప్పారు మీకు?: హీరో శివాజీ

09-05-2018 Wed 14:57 | Andhra
  • బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు
  • అశోక్‌ బాబుపై బీజేపీ నేతల తీరు బాగోలేదు
  • అశోక్‌ బాబుకి అండగా ఉంటాం
  • రేపు 'హోదా కోసం జాగారం' చేస్తాం
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీనటుడు శివాజీ.. అశోక్‌ బాబుపై బీజేపీ నేతల తీరు బాగోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఈ రోజు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు 13 జిల్లాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

విజయవాడలో వారి ఆందోళనకు మద్దతు తెలిపిన శివాజీ మీడియాతో మాట్లాడుతూ... "అశోక్‌ బాబుపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సమైక్యాంధ్ర కోసం కూడా పోరాడారు. అశోక్‌ బాబు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నారు. అశోక్‌ బాబునే కాదు.. మమ్మల్ని కూడా అలాగే విమర్శిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు దొరకట్లేదు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఇలా విమర్శలు చేస్తున్నామని మమ్మల్ని అంటున్నారు. మాకు సినిమాల్లో అవకాశాలు లేవని అసలు ఎవరు చెప్పారు మీకు?

ఎన్జీవోల నిజాయతీని శంకించొద్దు. ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోతే రేపు వారి పిల్లలకి కూడా ఉద్యోగాలు రావు. అందరి కోసం వారు పోరాటం చేస్తున్నారు. కర్ణాటక వెళ్లి ప్రచారం చేస్తే ఏమవుతుంది? ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వోద్యోగులుగానే ఉండాలని అంటున్నారు. మరి ప్రధానమంత్రి ప్రధానమంత్రిగానే ఉంటున్నారా? హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదు. వ్యక్తిగత విమర్శలు వద్దు. అశోక్ బాబు వెనుక ప్రజా సంఘాలు ఉన్నాయి.. అందరూ ఉంటారు.. ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన వెనుక అందరమూ ఉంటాం.

ఆయనను ఏకాకిని చేసి ఆయనపై దాడి చేస్తామంటే మేము ఊరుకోం. అలాగే మేము రేపు హోదా కోసం జాగారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విజయవాడలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తాం" అని అన్నారు. 
Special Category StatusshivajiAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more